Thu Mar 19 2026 07:41:26 GMT+0530 (India Standard Time)
Sabarimala : శబరిమలకు రికార్డు స్థాయిలో భక్తులు
శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు

శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దర్శనానికి పది గంటలకు పైగానే సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో ముందుగా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి అవకాశమని చెప్పినా అనేక మంది బుక్ చేసుకోకుండానే శబరిమలకు చేరుకుంటున్నారు.
పది గంటలు...
దీంతో పంబ నుంచి శబరిమల సన్నిధానం వరకూ క్యూ లైన్ ఉంది. గత నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. మండల పూజలకు అధికంగా వస్తుండటం ఇదే తొలిసారి అని ట్రావెన్ కోర్డు దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకంటున్నామని తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

