Mon Dec 15 2025 08:40:15 GMT+0000 (Coordinated Universal Time)
Sabarimala : శబరిమలలో అయ్యప్పను దర్శించుకోవాలంటే?
శబరిమలకు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు

శబరిమలకు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అయ్యప్ప స్వామి దర్శనానికి పది గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకూ క్యూ లైన్ లు విస్తరించి ఉన్నాయి. మండల పూజలు ప్రారంభం కావడంతో శబరిమలకు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లను ఆలయ కమిటీ చేస్తుంది.
కీలక నిర్ణయాలు...
ఇప్పటికే భక్తుల దర్శనం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోవడం ద్వారా దర్శనం కల్పిస్తుంది. అయినా భక్తుల తాకిడి తగ్గకపోవడంతో గంటల సమయం దర్శనానికి పడుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల మొత్తం శబరిమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని అంచనాతో అనేక నిర్ణయాలు తీసుకుంటుున్నారు.
Next Story

