Thu Jan 29 2026 03:02:04 GMT+0000 (Coordinated Universal Time)
కొండచరియలు విరిగిపడి.. ఏడుగురు మృతి
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగిపడటంతో మట్టిదిబ్బల కింద అనేక మంది ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతుంది. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కొండ చరియలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు.
సహాయక చర్యలు...
సంఘటన తెలిసిన వెంటనే జాతీయ విపత్తు దళాలతో పాటు కేరళ రాష్ట్ర సహాయక బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మట్టి దిబ్బల కింద అనేక మంది ఉన్నట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. అయితే కొండచరియలు విరిగిపడి ఎంత మంది అందులో చిక్కుకున్నారన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

