Thu Mar 19 2026 23:39:05 GMT+0530 (India Standard Time)
కుంభకర్ణుడు యంత్రాలు తయారు చేస్తాడా?
కుంభకర్ణుడు అంటే మనకు తెలిసింది ఒక్కటే. ఆరు నెలలు మేల్కొంటాడు. ఆరు నెలలు నిద్రపోతాడు

కుంభకర్ణుడు అంటే మనకు తెలిసింది ఒక్కటే. ఆరు నెలలు మేల్కొంటాడు. ఆరు నెలలు నిద్రపోతాడు. ఇదీ పురాణాల్లో మనం వినింది. అయితే ఆనందీబెన్ ఇప్పుడు కుంభకర్ణుడి విషయంలో కొత్త భాష్యం చెప్పారు. లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆనందీ బెన్ మాట్లాడుతూ కుంభకర్ణుడి విషయంలో కొత్త విషయాలు చెప్పుకొచ్చారు.
కొత్త యంత్రాలను తయారు....
కుంభకర్ణుడు కొత్త యంత్రాలను తయారు చేసేవాడని, రావణుడి సూచన మేరకు ఆరు నెలల పాటు రహస్యంగా ఈ యంత్రాలను తయారు చేసే వాడని, ఇతరులకు చిక్కకుండా యంత్రాలను తయారు చేసి రావణుడికి అందించారని, రావణుడి ఆదేశాల మేరకే ఈ యంత్రాలను తయారు చేసి కుంభకర్ణుడు ఇచ్చాడని ఆమె చెప్పారు. ఇప్పుడు ఆనందీ బెన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
Next Story

