Fri Dec 05 2025 16:35:56 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. పీసీసీ ఛీఫ్ల ఎంపికపై
నేడు కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం జరుగుతుంది.

నేడు కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం జరుగుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. అతి త్వరలోనే తెలంగాణతో సహా ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించి కొత్త పీసీసీ అధ్యక్షుల నియమాకంతో పాటు ఏఐసీసీ ప్రక్షాళన వంటి విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఏఐసీసీ ప్రక్షాళన...
ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా యువనేతలకు జాతీయ స్థాయిలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈరోజు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ఛార్జులు, రాష్ట్రాల ఇన్ఛార్జిలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీలతో విస్తృత సమావేశం జరుగుతుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎవరన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో నేడు క్లారిటీ వచ్చే అవకాశముందని తెలిసింది.
Next Story

