Sun Feb 01 2026 19:33:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కాంగ్రెస్ నేతల కీలక భేటీ
కాంగ్రెస్ నేతల కీలక భేటీ నేడు జరగనుంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

కాంగ్రెస్ నేతల కీలక భేటీ నేడు జరగనుంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
పార్లమెంటు సమావేశాల్లో....
రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని పార్లమెంటులో కూడా ఆమోదించనుంది. దీంతో పాటు రైతుకు మద్దతు ధర కల్పిస్తూ చట్టం చేయాలని కాంగ్రెస్ ఆందోళన చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు కొన్ని కీలక అంశాలపై కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఈరోజు నేతలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దిశానిర్దేశం చేస్తారు.
Next Story

