Wed Jan 21 2026 12:51:41 GMT+0000 (Coordinated Universal Time)
ఫుట్ బాల్ మ్యాచ్ లో అపశృతి.. గ్యాలరీ కూలి 200 మందికి గాయాలు
మలప్పురం పూన్ గోడ్ లో శనివారం ఫుట్ బాల్ మ్యాచ్ పోటీలు నిర్వహించారు. ఆ పోటీలను చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం..

కేరళ : ఫుట్ బాల్ మ్యాచ్ లో అపశృతి చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా గ్యాలరీ కూలిపోవడంతో 200 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కేరళలో జరిగింది. మలప్పురం పూన్ గోడ్ లో శనివారం ఫుట్ బాల్ మ్యాచ్ పోటీలు నిర్వహించారు. ఆ పోటీలను చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం తాత్కాలిక గ్యాలరీ ఏర్పాటు చేశారు.
ఆ గ్యాలరీ ఒక్కసారిగా కూలిపోయింది. గ్యాలరీ కూలుతున్న సమయంలో అక్కడున్న వారు పరుగులు తీసినా లాభంలేకపోయింది. గ్యాలరీ వేగంగా కూలడంతో.. 200 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. తాత్కాలిక గ్యాలరీ కూలిపోతున్న వీడియోను ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ఏఎన్ఐ ట్విట్టర్ లో షేర్ చేసింది.
Next Story

