Mon Feb 02 2026 09:18:47 GMT+0000 (Coordinated Universal Time)
కేరళలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి కేరళలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది

కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి కేరళలో రాత్రి వేళ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేరళలో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఆందోళన చెందిన ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది.
అనేక రాష్ట్రాల్లో.....
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ ను విధించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ అమలవుతుంది. తాజాగా కేరళ కూడా ఇదే జాబితాలో చేరింది. కేరళ ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించే దిశగా వెళుతుంది.
Next Story

