Fri Feb 27 2026 13:09:27 GMT+0530 (India Standard Time)
కన్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్... ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నుంచి డిశ్చార్జ్ చేసింది. వీరితో పాటు కేసీఆర్ కుమార్తె కవితకు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ కన్నీటి పర్యంత మయ్యారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారన్నారు.
అక్రమ కేసులు...
రాజకీయంగా లబ్ది పొందేందుకు, ఆమ్ ఆద్మీ పార్టీని రాజకీయంగా నాశనం చేసేందుకు అక్రమ కేసులు బనాయించారని కేజ్రీవాల్ అన్నారు. మనీష్ సిసోడియాను రెండేళ్ల పాటు జైలులో ఉంచారని ఆయన ఆవేదన చెందారు. తనపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. అభియోగాలపై తగిన ఆధారాలు లేవంటూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పడంతో ఈ కేసులో అందరికీ భారీ ఊరట దక్కినట్లయింది.
అందరికీ ఉపశమనం...
లిక్కర్ పాలసీ అవినీతి కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కుకు ఢిల్లీ కోర్టు శుక్రవారం ఉపశమనం కల్పించింది. ఈ కేసులో ఆయనపై నమోదైన ఆరోపణల నుంచి కోర్టు విడుదల చేసింది.రౌస్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఈ కేసులో ఆప్ నేత మనీష్ సోసిసోడియాను కూడా విడుదల చేశారు. మొత్తం 23 మంది నిందితులందరినీ కోర్టు విముక్తి కల్పించింది. దర్యాప్తులో లోపాలపై సీబీఐపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. “విపులమైన ఛార్జిషీట్లో అనేక ఖాళీలు ఉన్నాయి. వాటికి మద్దతుగా సాక్షులు, ప్రకటనలు లేవు” అని పేర్కొంది. సిసోడియాపై ప్రాథమిక ఆధారాలు కూడా చూపించలేకపోయిందని తెలిపింది. కేజ్రీవాల్‌ను సరైన ఆధారాలు లేకుండానే ఈ కేసులో ఇరికించారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Next Story

