Mon Dec 08 2025 14:56:58 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు మరింత చేదోడు వాదోడుగా?
ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం రైతు ప్రయోజనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది.

కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మరిన్ని వరాలను ప్రకటించనుంది. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం రైతు ప్రయోజనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో రైతులకు ఎక్కువ లబ్ది చేకూరేలా పద్దులు ఉంటాయని అంచనాలు విన్పిస్తున్నాయి.
రానున్న బడ్జెట్ లో....
రైతులకు ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి ఆరు వేలు ప్రస్తుతం ఇస్తున్నారు. దానిని ఎనిమిది వేలకు పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వం యోచనగా ఉంది. అలాగే రైతులు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మద్దతు ధరపై దీర్ఘకాలంగా రైతులు కోరుతున్న డిమాండ్ ను తీర్చాలన్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ లో రైతాంగాన్ని ఆకట్టుకోవడానికి ఈ నిర్ణయాలు దోహదం చేస్తాయంటున్నారు.
Next Story

