Tue Jan 20 2026 15:25:00 GMT+0000 (Coordinated Universal Time)
సిద్ధరామయ్య మెడకు మైసూరు స్థలం ఉచ్చు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డారు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థలో కుంభకోణం ఆయనకు మెడకు చుట్టుకుంది

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డారు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థలో కుంభకోణం ఆయనకు మెడకు చుట్టుకుంది. మైసూరులో ఒక స్థలం కేటాయింపుపై సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసు కేసు నమోదయింది. కేసు నమోదుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి ఇచ్చారు. ముడా భూకేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని సిద్ధరామయ్య కుటుంబ సభ్యులపై ఆరోపణలు వచ్చాయి. మైసూరులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మకు మూడు ఎకరాల భూమి ఉంది.
కేసుకు అనుమతి ఇవ్వడంతో...
అయితే డెవలెప్మెంట్ లో భాగంగా ముడా దానిని స్వాధీనం చేసుకుని 38,283 చదరపు గజాల స్థలాన్ని విజయనగర ప్రాంతంలో కేటాయించింది. ఇది అత్యంత కాస్ట్లీ ప్రదేశం. కెసెరలోని భూమితో పోలిస్తే విజయనగర లో కేటాయించిన భూమి అత్యంత విలువైనదని, కేవలం సిద్ధరామయ్య సతీమణి కాబట్టి ఆమెకు కాస్ట్లీ స్థలం ఇచ్చారని ఆరోపించారు. దీనిపై బీజేపీ నేతలు కూడా ఆందోళన చేశారు. నిరసనలకు దిగారు. అయితే బీజేపీ ప్రభుత్వ హయాంలోనే ఆ స్థలాన్ని కేటాయించిందని సిద్ధరామయ్య అంటున్నారు. మొత్తం మీద ఈ కేసుతో సిద్ధరామయ్య రాజకీయంగా చిక్కుల్లో పడే అవకాశముందంటున్నారు
Next Story

