Sun Dec 14 2025 02:01:20 GMT+0000 (Coordinated Universal Time)
సిద్ధరామయ్యకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. తదుపరి విచారణ ఆదేశాలు వచ్చేంత వరకూ సిద్ధరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ముడా స్కామ్ లో సిద్ధరామయ్య పై కేసు నమోదు చేయాలని రాష్ట్ర గవర్నర్ ఆదేశించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
గవర్నర్ కేసు...
హైకోర్టులో సిద్ధరామయ్య తరుపున సింఘ్వి తన వాదనలను వినిపించారు. గవర్నర్ కు సిద్ధరామయ్య లిఖితపూర్వకమైన వివరణ ఇచ్చినా ఆయన కేసు నమోదు చేయాలని ఆదేశించడం కక్ష సాధింపు చర్యలో భాగమేనని తెలిపారు. న్యాయస్థానం ఈ వాదనలు విన్న తర్వాత సిద్ధరామయ్యపై చర్యలు తీసుకోవద్దంటూ విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
Next Story

