Sun Mar 15 2026 15:03:40 GMT+0530 (India Standard Time)
Karnataka : సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముడా స్కామ్ లో గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించింది.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముడా స్కామ్ లో గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. మైసూరు నగరంలో భూ కుంభకోణానికి పాల్పడ్డారంటూ వచ్చారన్న ఆరోపణలపై గవర్నర్ కేసు నమోదుకు అనుమతి ఇచ్చారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు.
ముడా స్కాంలో...
సిద్ధరామయ్య రిట్ పిటీషన్ పై ఈ నెల 12వ తేదీన వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు చెబుతూ సిద్ధరామయ్య పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించడంతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. హైకోర్టు తీర్పు అనంతరం సిద్ధరామయ్య ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

