Fri Dec 05 2025 19:09:15 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కర్ణాటక ఎన్నికల షెడ్యూల్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల కానుంది. ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల కానుంది. ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఈ ఏడాది మేతో కర్ణాటక శాసనసభ సమయం పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతుంది.
ఇప్పటికే పార్టీలు...
ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేయనుంది. మొత్తం 220 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే ప్రధాన పార్టీలు సమాయత్తమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 124 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక ప్రధాని నుంచి కేంద్ర మంత్రుల వరకూ తరచూ కర్ణాటకలో పర్యటనలు చేస్తున్నారు.
Next Story

