Fri Dec 05 2025 15:38:10 GMT+0000 (Coordinated Universal Time)
వారితో మాత్రం జ్యోతి మల్హోత్రాకు ఎలాంటి సంబంధం లేదు: పోలీసులు
జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది.

భారతదేశానికి చెందిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేశారనే ఆరోపణలతో అరెస్టయిన జ్యోతి మల్హోత్రా ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది. వీరి ఇద్దరి మధ్య ఎమోషనల్‌గా జరిగిన వాట్సప్ చాటింగ్‌ను గుర్తించారు.
ఆ చాటింగ్‌లో తనను పెళ్లి చేసుకోవాలని జ్యోతి మల్హోత్రా అలీ హసన్ ను కోరింది. పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఆ చాట్‌లో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం జ్యోతి షేర్ చేసింది. కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో కూడా ఉన్నాయి. జ్యోతి మల్హోత్రాకు నాలుగు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, దుబాయ్ నుంచి వాటిలో డబ్బు జమ అవుతోందని దర్యాప్తులో తేలింది.
Next Story

