Wed Jan 28 2026 20:49:25 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఎన్నికలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఏమన్నారంటే?
ఉపరాష్ట్రపతి స్థానం రాజ్యాంగబద్ధమైన పదవి అని ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు

ఉపరాష్ట్రపతి స్థానం రాజ్యాంగబద్ధమైన పదవి అని ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు సరైన నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నానని ఆయన అభిప్రాయపడ్డారు. సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని ఎంపీలను కోరుతున్నానని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పిలుపు నిచ్చారు.ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు కాదని, తనకు ఏ పార్టీతో సంబంధం లేదని, ఎలాంటి భావజాలం లేదని చెప్పుకొచ్చారు.
రాజ్యాంగ పరిరక్షణకు...
తనకు పార్టీతోను నాకు సంబందాలు లేవని, సమానత్వం, స్వేచ్ఛపై తనకు అవగాహన ఉందని ఆయన అన్నారు. భారతీయ రాజకీయ వ్యవస్థలో కొన్ని మార్పులు జరగాల్సివుందని తెలిపారు. రాజ్యస్యసభను నిష్పక్షపాతంగా నడపటం అవసరమని, రాజ్యసభలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తనను ఎన్నుకుంటే రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తానని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపీలను కోరారు.
Next Story

