Thu Dec 18 2025 10:17:50 GMT+0000 (Coordinated Universal Time)
జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. భారత యాభై రెండో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. సంజీవ్ ఖన్నా మే 13వ తేదీన పదవీ విరమణ చేయడంతో నేడు జస్టిస్ గవాయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఆరు నెలల పాటు
జస్టిస్ గవాయ్ ఆరు నెలలకు పైగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. 2025 నంబవరు 23న జస్టిస్ గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రెండో దళిత న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మోదీ తో పాటు ఇతర మంత్రులు అధికారుల పాల్గొన్నారు.
Next Story

