Sat Mar 07 2026 18:59:31 GMT+0530 (India Standard Time)
లాలూ ప్రసాద్ కు బెయిల్ మంజూరు
లాలూకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఆరోగ్య సమస్యలతో లాలూ ప్రసాద్ యాదవ్ సగం శిక్షాకాలం..

జార్ఖండ్ : ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరైంది. లాలూ ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డొరండ ట్రెజరీ కేసులో సీబీఐ ఆయనకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ న్యాయవాది మీడియాతో మాట్లాడారు.
లాలూకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఆయన తెలిపారు. ఆరోగ్య సమస్యలతో లాలూ ప్రసాద్ యాదవ్ సగం శిక్షాకాలం జైల్లో గడిపారని.. ఇప్పుడు ఆరోగ్యం బాలేకపోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. రూ. 10 లక్షల జరిమానా, రూ. 1 లక్ష విలువైన పూచీకత్తును సమర్పించాలని ఆదేశించినట్టు చెప్పారు.
Next Story

