Mon Mar 16 2026 05:59:43 GMT+0530 (India Standard Time)
JEE : నేడు జేఈఈ మెయిన్స్ పరీక్షలు
నేటి నుంచి దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు

నేటి నుంచి దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. నిట్ లో బ్యాచ్లర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచ్లర్స్ ఆఫ్ ప్లానింగ్ లో ప్రవేశానికి బుధవారం పేపర్ -2 పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 27, 29, 30, 31 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో బిటెక్ కోర్సుల్లో చేరేందుకు పేపర్ -1 పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షల నిర్వహణకు...
అయితే ఈ రెండు పేపర్లుకు రికార్డ్ స్థాయిలో 12 లక్షల 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమయినా లోపలికి అనుమతించమని అధికారులు తెలిపారు. అనేక చోట్ల ఇందుకోసం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Next Story

