Fri Dec 05 2025 08:02:23 GMT+0000 (Coordinated Universal Time)
ఉభయసభల్లో అత్యంత ధనవంతుడైన ఎంపీ మృతి
జేడీయూ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత మహేంద్ర ప్రసాద్ మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు.

జేడీయూ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత మహేంద్ర ప్రసాద్ మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. పారిశ్రామికవేత్తగా ఉన్న మహేంద్ర ప్రసాద్ జేడీయూ లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన బీహార్ నుంచి ఏడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఒకసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉభయ సభల్లో సభ్యుడిగా ఉన్న మహేంద్ర ప్రసాద్ మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఫార్మస్యూటికల్స్ అధినేతగా....
మహేంద్ర ప్రసాద్ అరిస్టో ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకుడు. అత్యంత ధనికుడు. ఆయన 81 ఏళ్ల వయసులో అనారోగ్యం పాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

