Sat Mar 07 2026 21:20:16 GMT+0530 (India Standard Time)
"కుమార" నిర్వేదం
కింగ్ మేకర్ కావాలనుకుంటున్న జేడీఎస్ నేత కుమారస్వామి మాత్రం నిర్వేదంగా కనిపించారు

కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అయితే కింగ్ మేకర్ కావాలనుకుంటున్న కుమారస్వామి మాత్రం నిర్వేదంగా కనిపించారు. ఆయన చేసిన కామెంట్స్ కూడా అలాగే అనిపించాయి. తన పార్టీ జనతాదళ్ ఎస్‌కు 25 స్థానాలు మించి రావని ఆయన జోస్యం చెప్పుకొచ్చారు.
25 సీట్లకు...
తాము 25 సీట్లకు మించి గెలవలేమని చెప్పారు. ధన బలాన్ని తట్టుకోలేక పోయామని కుమారస్వామి అన్నారు. ఆయన నిర్వేదంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. పాత మైసూరు ప్రాంతంలోనూ కుమారస్వామి పార్టీకి పెద్దగా ప్రజలు ఆదరించలేదని ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది.
Next Story

