Fri Feb 06 2026 08:26:09 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : జల్ బోర్డు తవ్విన గుంతలో పడి యువకుడి మృతి
డిల్లీ లో విషాదం చోటు చేసుకుంది. జల్ బోర్డు నిర్లక్ష్యంతో ఒక యువకుడు మరణించాడు

డిల్లీ లో విషాదం చోటు చేసుకుంది. జల్ బోర్డు నిర్లక్ష్యంతో ఒక యువకుడు మరణించాడు. జనకపురిలో ఈ ఘటన జరిగింది. కమల్ అనే యువకుడు బైక్పై వెళ్తుండగా డిల్లీ జల్ బోర్డు తవ్విన పెద్ద గుంతలో పడిపోయి మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. జనకపురిలో ఈ జరిగిన ఘటన మరోసారి అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది.
అనుమానంగా..
బైక్ పై వస్తుండగా జల్ బోర్డ్ తవ్విన గుంటలో పడి కమల్ అనే యువకుడు మరణించాడు. అక్కడ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కమల్ నిజంగా గుంతలో పడిపోయాడా? లేక మరో కోణం ఉందా? అనే అంశాలపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని చెప్పారు.దర్యాప్తు కొనసాగుతోంది.
Next Story

