Sat Jan 17 2026 08:17:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తమిళనాడులో జల్లికట్టు పోటీలు
నేడు తమిళనాడులోని అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి

నేడు తమిళనాడులోని అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. పోటీల్లో వెయ్యికి పైగా ఎద్దులు పాల్గొంటున్నాయి. ఆరు వందల మంది యువకులు పోటీ పడుతున్నారు. పోటీల్లో నిలిచిన వారికి కార్ల బహుమతులు ఇవ్వడానికి సిద్ధం చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా జల్లికట్టు పోటీలను రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్నారు.
వైద్య శిబిరాలు ఏర్పాటు...
పోటీల దగ్గర వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జల్లికట్టు పోటీల సందర్భంగా పోట్ల గిత్తలను ఆపేందుకు యువకులు పోటీ పడతారు. అయితే ఈ సందర్భంగా అనేకమందికి గాయాలపాలవుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి ప్రాధమిక చికిత్స చేసేందుకు చర్యలను నిర్వాహకులు తీసుకుంటున్నారు. ఇప్పటికీ కొందరు గాయపడిన వారికి చికత్స అందిస్తున్నారు.
Next Story

