Fri Dec 05 2025 12:01:18 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ థన్కర్
ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి గా జగదీప్ ధన్కర్ ను ఎంపిక చేశారు. ప్రస్తుతం బెంగాల్ గవర్నర్ గా ఆయన ఉన్నారు.

ఎన్డీఏ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ను ఎంపిక చేశారు. ప్రస్తుతం బెంగాల్ గవర్నర్ గా ఆయన ఉన్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. థన్ఖర్ 1951 మే 18వ తేదీన రాజస్థాన్ లో ఒక కుగ్రామంంలో జన్మించారు. సైనిక్ స్కూలులో ఆయన విద్యాభ్యాసం జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1989 నుంచి 1991 వరకూ లోక్ సభ సభ్యుడిగా జగదీప్ ధన్కర్ ఉన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. రైతు కుటుంబం నుంచి వచ్చారు. 2019 లో జగదీప్ థనకర్ ను పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమించారు. అప్పటి నుంచి ఆయన గవర్నర్ గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
అనుభవం ఉన్న నేతగా....
జగదీప్ ధన్కర్ జాట్ సామాజికవర్గానికి చెందని వ్యక్తి. ఈరోజు సమావేశమయిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు జగదీప్ ధన్కర్ ను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించింది. ఆయన ఎన్నిక నామమాత్రమే. పార్లమెంటు సభ్యులు మాత్రమే ఎన్నికునే అవకాశం ఉండటంతో ఈ ఎన్నిక నామమాత్రంగానే జరగనుంది. జగదీప్ థనకర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని ముప్పుతిప్పలు పెట్టారు. రాజ్యసభలో భవిష్యత్ లో ప్రవేశ పెట్టిన బిల్లులు ఆమోదం పొందాలన్నా, విపక్ష నేతలను కట్టడి చేయాలన్నా కరడు గట్టిన జగదీప్ థనకర్ ను ఎంపిక చేసినట్లు కనపడుతుంది.
Next Story

