Sat Dec 13 2025 10:14:08 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పూరీ జగన్నాధయాత్ర
నేడు పూరీలోని జగన్నాధయాత్ర కొనసాగనుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు.

నేడు పూరీలోని జగన్నాధయాత్ర కొనసాగనుంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. పూరీ జగన్నాధయాత్రలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. పూరీ జగన్నాధయాత్ర ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది కావడంతో ఈ యాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయపరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటికిటలాడుతున్నాయి.
రెండు రోజుల పాటు...
పూరీ జగన్నాధయాత్ర రెండు రోజుల పాటు సాగనుంది. ఈరోజు, రేపు యాత్ర కొనసాగనుంది. అయితే ఈ యాత్రలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు అన్నప్రసాదాలను, తాగునీటిని ఉచితంగా భక్తులకు అందచేస్తున్నారు.
Next Story

