Thu Dec 18 2025 11:14:01 GMT+0000 (Coordinated Universal Time)
అది ప్రాణాంతకమైన పొగమంచు: అఖిలేష్
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. ఈ పరిణామంపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఢిల్లీ కాలుష్యం ఇప్పుడు లక్నోకు కూడా పాకింది. ఇది సాధారణ మంచు కాదు, ప్రాణాంతకమైన పొగమంచు అని అఖిలేష్ అన్నారు. బీజేపీకి ప్రజల ఆరోగ్యంపైనా, పర్యావరణంపైనా ఏమాత్రం పట్టింపు లేదని ఆయన విమర్శించారు. ఏకానా స్టేడియంలో పొగమంచు కారణంగా క్రీడాకారులకు మైదానం స్పష్టంగా కనిపించలేదు. దీంతో టాస్‌ను పలుమార్లు వాయిదా వేసిన అంపైర్లు, చివరికి పరిస్థితిని సమీక్షించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Next Story

