Mon Mar 30 2026 14:15:31 GMT+0530 (India Standard Time)
ఇరాన్ నిర్ణయంతో భారత్ కు ఊరట
భారత్కు ఊరటనిచ్చేలా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది

భారత్కు ఊరటనిచ్చేలా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత నౌకలకు హార్మూజ్ మార్గం తెరుచుకుంటూనే ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటన చేయడం ఊరట కలిగించింది. భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్, ఇరాక్ తమతో సమన్వయం చేసుకున్నాయని ఇరాన్ తెలిపింది.
శత్రుదేశాల నౌకలకు మాత్రం...
శత్రు దేశాల నౌకలకు మాత్రం అనుమతి లేదని తేల్చి చెప్పిన ఇరాన్, తమ అనుమతి లేకుండా హార్మూజ్ మార్గం నుంచి వెళితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇటీవల కాలంలో హార్మూజ్ జలసంధి నుంచి ప్రయాణించే నౌకల నుంచి పెద్ద మొత్తంలో సుంకాన్ని కూడా వసూలు చేస్తుంది.
Next Story

