Fri Dec 05 2025 11:17:32 GMT+0000 (Coordinated Universal Time)
Plane Crash : ఆధారం అదే.. ఇంతకీ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి?
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. బ్లాక్ బాక్స్ కోసం శిధిలాల్లో వెదుకుతున్నారు

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. దాదాపు 265 మంది మరణించడంతో అన్ని సంస్థలు దీనిపై విచారణను ప్రారంభించాయి. అయితే శిధిలాల్లో బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. టేకాఫ్ అయిన విమానం బీజే ఆసుపత్రి హాస్టల్ భవనంపై కూలిపోవడంతో మధ్యలో భాగం మొత్తం మాడి మసై పోయింది. తోక భాగం శిధిలాల కింద కూరుకు పోయింది. విమానం వెనక భాగాన ఉండే బ్లాక్ బాక్స్ కోసం దర్యాప్తు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బయట నుంచి ఎవరినీ ఆ ప్రాంతంలోకి అనుమతించకుండా బ్లాక్ బాక్స్ కోసం వెదుకుతున్నారు.
ప్రతి విషయమూ రికార్డయి...
బ్లాక్ బాక్స్ అంటే అందులో విమానంలో జరిగే ప్రతి విషయం రికార్డ్ అవుతుంటుంది. విమానం బయలుదేరిన దగ్గర నుంచి ల్యాండింగ్ అయ్యేంత వరకూ అందులో రికార్డింగ్ అయి ఉంటుంది. దీంతో పాటు కాక్ పిట్ లో ఉన్న పైలెట్లు ఏం మాట్లాడుకున్నారు? ఏటీసీకి ఏ సందేశం పంపారు? వారి వ్యక్తిగత సంభాషణలు కూడా ఇందులో రికార్డు అవుతాయి. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే అది కూడా బ్లాక్ బాక్స్ ద్వారానే తెలుసుకునే వీలుంది. రేడియో ట్రాఫిక్ నుంచి సిబ్బంది చేసే అనౌన్స్ మెంట్లు కూడా ఇందులో రికార్డు అవుతాయి.
ఆరెంజ్ కలర్ లోనే...
అయితే పేరుకు మాత్రం బ్లాక్ బాక్స్ మాత్రమే కానీ ఇది ఆరెంజ్ రంగులో ఉంటుంది. విమాన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇందులో విశ్లేషించడం ద్వారా ప్రమాదాలకు గల కారణాలను తెలుసుకుంటారు. అందుకే విమానాల్లోనూ, ప్రమాదం జరిగిన తర్వాత బ్లాక్ బాక్స్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్లనే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత వస్తుంది. బ్లాక్ బాక్స్ ఎంత ప్రమాదం జరిగినా చెక్కు చెదరదు. అందుకే ఇది నాశనమయ్యే అవకాశం ఉండదు. విమానం వెనక భాగంలో బ్లాక్ బాక్స్ ఉంటుంది. విమానం వెనక భాగం బీజే ఆసుపత్రి కళాశాల శిధిలాల్లో బ్లాక్ బాక్స్ ఉండే అవకాశముంది. అక్కడ శిధిలాల్లో బ్లాక్ బాక్స్ కోసం వెదుకుతున్నారు. అది దొరికితే తప్ప అసలు కారణం తెలియదు. ఎంత ప్రమాదం జరిగినా గుర్తుపట్టడానికే ఆరెంజ్ కలర్ లో ఈ బ్లాక్ బాక్సు ఉంటుందని మాజీ పైలెట్లు చెబుతున్నారు.
Next Story

