Tue Dec 16 2025 23:45:49 GMT+0000 (Coordinated Universal Time)
భారత సైన్యం చేతుల్లోకి ఇన్వర్ క్షిపణి
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇప్పటికే ఆకాశ్, నాగ్ మిసైళ్లను భారత సైన్యానికి అందించింది.

భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇప్పటికే ఆకాశ్, నాగ్ మిసైళ్లను భారత సైన్యానికి అందించింది. త్వరలో మరో క్షిపణిని కూడా అందించబోతోంది. ఆ క్షిపణి పేరు 'ఇన్వర్'. యాంటీ- ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ అయిన ఇన్వర్ క్షిపణిని భారత సైన్యంలోని టీ-90 ట్యాంకులకు అమర్చుతారు.
అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో టీ-90 ట్యాంకులను, సైన్యాన్ని బలోపేతం చేసేందుకు ఈ కొత్తరకం క్షిపణిని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో 500 క్షిపణులను బీడీఎల్ అందించనుంది. ఈ కాంట్రాక్టు విలువ 2,000 నుండి 3,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
Next Story

