Sat Dec 06 2025 00:09:52 GMT+0000 (Coordinated Universal Time)
Indore : ఇండోర్ లో భూకంపం
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో స్వల్పంగా భూమి కంపించింది. ఈరోజు తెల్లవారు జామున భూకంపం సంభవించింది

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో స్వల్పంగా భూమి కంపించింది. ఈరోజు తెల్లవారు జామున భూకంపం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 3.5 గా నమోదయింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటన చేసింది.
తీవ్రతను గుర్తించి...
ఇండోర్ కు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూకంప కేంద్రం ఈ తీవ్రతను గుర్తించింది. భూమిలో ఐదు కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది.
- Tags
- earthquake
- indore
Next Story

