Sat Dec 06 2025 09:17:58 GMT+0000 (Coordinated Universal Time)
విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం సీరియస్
ఇండిగో విమానాల రద్దుతో మిగిలిన విమానయాన సర్వీసులు ఛార్జీలు పెంచారు

ఇండిగో విమానాల రద్దుతో మిగిలిన విమానయాన సర్వీసులు ఛార్జీలు పెంచారు. దీంతో పౌర విమానయాన శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అన్ని మార్గాల్లో ధరలను భారీగా పెంచాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే విమాన ఛార్జి ఆరు నుంచి ఏడు వేల రూపాయలు ఉంటుంది. కానీ ఇప్పుడు యాభై వేల రూపాయలకు పెంచింది.
టిక్కెట్ల రేట్లు పెంచవద్దంటూ...
విమానాల రద్దుతో క్యాష్ చేసుకోవాలనుకుంటున్న విమానయాన సంస్థలు ఛార్జీలు పెంచవద్దని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. అలా ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. సాధారణ రోజుల్లో తీసుకునే టిక్కెట్లను మాత్రమే ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది.
Next Story

