Sat Dec 06 2025 07:05:24 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టుకు ఇండిగో సంక్షోభం
దేశ వ్యాప్తంగా తలెత్తిన ఇండిగో విమాన సంస్థ సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది.

దేశ వ్యాప్తంగా తలెత్తిన ఇండిగో విమాన సంస్థ సంక్షోభం సుప్రీంకోర్టుకు చేరింది. గత ఐదు రోజుల నుంచి ఇండిగో విమాన సర్వీసులు వేల సంఖ్యలో రద్దయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.
విచారణ చేపట్టాలంటూ...
ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసును అత్యవసర విచారణ చేపట్టాలని పిటీషనర్ కోరారు. అయితే నేడు, రేపు సుప్రీంకోర్టుకు సెలవు కావడంతో ప్రత్యేక బెంచ్ దీనిపై విచారణ జరుపుతుందా? లేక సోమవారం విచారణ చేయనుందా? అన్నది మరికాసపట్లో తేలనుంది. ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయి అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
Next Story

