Sun Dec 14 2025 01:54:41 GMT+0000 (Coordinated Universal Time)
Vinesh Phogat : ఇంతటి కఠిన నిర్ణయమా?
భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రెజ్లింగ్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు

భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రెజ్లింగ్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్స్ ఫైనల్స్ లో వంద గ్రాముల అధిక బరువు ఉందని ఆమె పై నిర్వాహకులు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోల్డ్ మెడల్ సాధించేందుకు బరిలోకి దిగిన వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడటం ఆమె జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఆమె రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
కుస్తీ గెలిచిందని...
వినేశ్ ఫొగాట్ తనపై కుస్తీ గెలిచిందని, తాను ఓడిపోయానని, క్షమించండి, మీ కల, మీ ధైర్యం భగ్నమైందని, ఇంతకంటే తనకు పోరాడే బలం లేదని వినేశ్ ఫొగాట్ అన్నారు. ఆమె గోల్డ్ మెడల్ కోసం పరితపించారు. దీంతో ఆమె కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్ లో వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడటంపై భారతదేశం మొత్తం ఆమెకు అండగా నిలిచింది. ప్రధాని నుంచి సామాన్యుడి వరకూ ఆమెకు మద్దతుగా నిలిచారు.
Next Story

