Thu Dec 18 2025 07:32:17 GMT+0000 (Coordinated Universal Time)
ISRO : 17న మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి రెడీ అయిపోయింది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి రెడీ అయిపోయింది. మరింత మెరుగైన వాతావరణ అంచనాల కోసం జీఎస్ఎల్వీ-ఎఫ్14/ఇన్సాట్-డీఎస్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఫిబ్రవరి 17న శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్14ను ప్రయోగించనుంది. సాయంత్రంత నాలుగు గంటలకు ఈ ప్రయోగం చేయనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట వేదికగా జరగనున్న ఈ ప్రయోగం మరో కీలకం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరో కీలక ప్రయోగం...
జీఎస్ఎల్వీ ఇన్సాట్-3డీఎస్ వాతావరణ ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఇస్రో ట్విట్టర్ లో తెలపడంతో ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది. మన ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమయిందని ప్రపంచానికి తెలిసింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం జీఎస్ఎల్వీ మూడు దశల లాంచ్ వెహికిల్ అని, ఇది 51.7 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువు ఉంటుందని పేర్కొంది.
Next Story

