Tue Feb 17 2026 12:45:09 GMT+0530 (India Standard Time)
రైల్ వన్ యాప్ కు సూపర్ రెస్పాన్స్
భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'రైల్ వన్ ' సూపర్ యాప్ ప్రయాణికుల ఆదరణ పొందుతోంది

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'రైల్ వన్ ' సూపర్ యాప్ ప్రయాణికుల ఆదరణ పొందుతోంది. IRCTC, UTS, రైల్ మదద్ వంటి విభిన్న సేవలను ఒకే ప్లాట్ఫామ్ పైకి తెచ్చిన ఈయాప్, టికెట్ బుకింగ్ నుండి ఫుడ్ ఆర్డర్ల వరకు అన్నింటినీ సులభతరం చేసింది. ఈ యాప్ కారణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవడం నుంచి రిజర్వేషన్ వరకూ సులువుగా మారింది.
అన్ని ఒకే యాప్ లో...
అలాగే రైలుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ యాప్ లో ఉండటంతో ప్రయాణికులకు పూర్తి సౌకర్యంగా, సులువుగా మారింది. దీంతో తమంతట తామే సుదూర ప్రయాణాలకు టిక్కెట్ ను బుక్ చేసుకునే వీలు కల్పిస్తూ రైల్వే శాఖ ఈ యాప్ ను తీసుకు వచ్చింది. బయోమెట్రిక్ భద్రత, ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, బహుభాషా మద్దతుతో రూపొందిన ఈయాప్, వేర్వేరు అప్లికేషన్ల అవసరం లేకుండా ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేసింది.
Next Story

