Fri Jun 20 2025 02:01:13 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : అమెరికాలో కొనసాగుతున్న మోదీ టూర్
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. అమెరికాలో ఆయన పర్యటన రెండో రోజు ప్రారంభమయింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. అమెరికాలో ఆయన పర్యటన రెండో రోజు ప్రారంభమయింది. మొదటి రోజు అమెరికా అధ్యక్షుడు బైడన్ తో సమావేశమై చర్చించారు. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి చర్చించారు. దీంతో పాటు ఉక్రెయిన్ - రష్యా మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ యుద్ధం, గాజా - ఇజ్రాయిల్ పై జరుగుతున్న యుద్ధంపై కూడా ఇరువురు నేతలు చర్చించుకున్నారు.
బైడెన్ తో భేటీ...
తర్వాత క్వాడ్ సదస్సుకు మోదీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఇండో - పసిఫిక్ రీజియన్ లో క్యాన్సర్ టెస్టింగ్ కోసం 7.5 మిలియన్ డాలర్ల సాయాన్ని మోదీ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తర్వాత సర్వైకల్ క్యాన్సర్ మీద కూడా ఆయన ప్రసంగించారు. స్వల్ప ధరలకే మందులను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Next Story