Sat Jan 31 2026 14:01:04 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi lakshadweep tour : మోదీ చేసిన సాహసం చూశారా...? మీరూ ఇక్కడకు వచ్చేయండి అంటూ
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ లో పర్యటించారు. ఆయన చేసిన సాహసాల ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

నరేంద్ర మోదీ ఎప్పుడు ఏం చేసినా వెరైటీగా ఉంటుంది. ఆయన పెద్దవాళ్లలో పెద్దవాడిగా.. చిన్నోళ్లలో చిన్న పిల్లవాడిగా కనిపిస్తారు. పదేళ్ల నుంచి ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోదీ తన విదేశాల పర్యటనలోనైనా, స్వదేశంలో వివిధ రాష్ట్రాలను పర్యటించినప్పుడైనా అక్కడి అందాలను చూసి ముగ్దులవుతారు. ప్రకృతికిన ఆస్వాదిస్తారు. పర్యాటక ప్రదేశాలను సందర్శించి అక్కడ ఎక్కువ సేపు గడపడం మోదీకి ఎంతో ఇష్టం. ఇక బీచ్ లంటే మోదీకి అమిత ఇష్టం. ఆయన సముద్రాన్ని చూస్తే చాలు పులకించి పోతారు. తాను ప్రధానిని అన్న విషయాన్ని కూడా మరచిపోయి అక్కడ అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను అందిపుచ్చుకుంటారు.
రెండు రోజుల పాటు...
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు లక్షద్వీప్ లో పర్యటించారు. అక్కడి సముద్రాన్ని చూసి ఆయన చిన్న పిల్లాడిలా మారిపోయారు. లక్ష ద్వీపాల అందాన్ని ఆస్వాదించేందుకు ఎన్నికళ్లున్నా చాలవన్నట్లు ఆయన పర్యటన సాగింది. ఆయన తన లక్షద్వీప్ పర్యటనకు సంబంధించి ఫొటోలను ఎక్స్ లో పంచుకున్నారు. సూర్య భగవానుడు ఉదయించకముందే బీచ్ కు వచ్చిన మోదీ అక్కడ నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. లక్షద్వీప్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడి ప్రజలు అందించిన ఆతిథ్యం అద్భుతమని ఆయన కొనియాడారు.
స్నార్కలింగ్...
అయితే ఆయన స్నార్కలింగ్ చేశారు. సముద్రం అంతర్భాగంలో ఉన్న అందాలను వీక్షించారు. అంతకు ముందు ఆయన బీచ్ ఒడ్డున కూర్చుని కాసేపు ప్రశాంతంగా గడిపారు. కాసేపు బీచ్ లో వాకింగ్ కూడా చేశారు. అయితే మోదీ ఎక్స్ లో మాత్రం భారతీయులకు ఒక సూచన కూడా చేశారు. సాహసాలు చేయాలనుకునే వారు లక్షద్వీప్ ను కూడా ఎంచుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. లక్షద్వీప్ ను ఇప్పటికే ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుంది. మోదీ ట్వీట్ తో ఇక అక్కడకు జనం క్యూ కడతారని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. చూశారా.. మోదీ ఎంతటి సాహసం చేశారో?
Next Story

