Tue Mar 17 2026 01:20:56 GMT+0530 (India Standard Time)
లీడర్.. నరేంద్ర మోదీ
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి ఘనత సాధించారు

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా మరోసారి ఘనత సాధించారు. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ఈ సంగతిని వెల్లడించింది. నరేంద్ర మోదీకి 78 శాతం ఆమోదం లభించింది. మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా పేరు తెచ్చుకున్నారు. మొత్తం 22 గ్లోబల్ లీడర్లపై మార్నింగ్ కన్సల్ట్ సంస్థ సర్వే చేసింది.
70 శాతం మంది...
ఒక్కోదేశంలో ప్రజల ఏడు రోజుల సగటును తీసుకుంది. ప్రధాని మోదీ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తర్వాత స్థానంలో ఉన్నారు. జో బైడెన్ కు నలభై శాతం ప్రజల ఆమోదం లభించింది. 78 శాతం మంది ప్రజలు ప్రధాని మోదీని ఆమోదించారు.
Next Story

