Fri Dec 05 2025 17:32:14 GMT+0000 (Coordinated Universal Time)
Plane Crash : డీజీసీఏ కీలక నిర్ణయం.. అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని నిర్ణయం
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. డీజీసీఏ కూడా కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. భారత్ లోని అన్ని బో్యింగ్ విమానాలకు సంబంధించిన తనిఖీలను నిర్వహించాలని నిర్ణయించారు.బోయింగ్ విమానాలను తనిఖీచేసి నివేదిక ఇవ్వాలని కోరింది. దీంతో ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలకు సంబంధించి తనిఖీలను నిర్వహించేందుకు సిద్ధమయింది. మరోవైపు భారత ప్రభుత్వం బోయింగ్ డ్రీమ్ లైన్ విమానాలను నిలిపి వేసే నిర్ణయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత విమానయాన చరిత్రలో అతి పెద్దవిషాద ఘటన అహ్మదాబాద్ లో జరగడంతో భారత ప్రభుత్వం వీటిని నిలిపేవేసే ఆలోచన ఉన్నట్లు స్పష్టమవుతంుది.
బోయింగ్ డ్రీమ్ లైన్ విమానాలను...
అయితే బోయింగ్ డ్రీమ్ లైన్ విమానాలను తాత్కాలికంగా నిలుపుదల చేసి అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత అనుమతించాలా? లేకపూర్తిగా నిలుపుదల చేయాలా? అనే అంశాలను సీరియస్ గా పరిశీలిస్తుంది. ఈ విషయంలో భారత్ - అమెరికా ఏజెన్సీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయని చెబుతున్నారు. అన్ని బోయింగ్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ ను నిర్వహించాలని కూడా డీజీసీఏ ఆదేశించింది. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించిన తర్వాత అనుమతించాలని కూడా డీజీసీఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తరచూ బోయింగ్ విమానాలు ప్రమాదాలకు గురి అవుతుండటంతోనే డీజీసీఏ, కేంద్ర ప్రభుత్వం ఈచర్యలను ప్రారంభించింది.
ఈ సిరీస్ కు చెందిన....
ప్రధానంగా 787 సిరీస్ కు చెందిన విమానాలను తనిఖీలు చేయడంలో ఎయిర్ ఇండియా నిమగ్నమయింది. బ్లాక్ బాక్స్ లభ్యం కావడంతో ప్రమాదానికి అసలు కారణం తెలిసే అవకాశముంది. అయితే డ్రీమ్ లైనర్ విమానాలను నిలుపుదల చేయాలా? లేక తాత్కాలికంగా ఆపాలా? అన్న దానిపై భారత ప్రభుత్వం నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ మేరకు పౌరవిమానయాన నిపుణులతో సంప్రదింపులు జరిపి, డ్రీమ్ లైనర్ విమానాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వాటిని నిషేధించడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చా? అన్న అభిప్రాయాన్ని కూడా పౌర విమానయాన శాఖ సేకరిస్తున్నట్లు తెలిసింది. అహ్మదాబాద్ ప్రమాదంలో మాత్రమే కాదు గతంలోనూ అనేకసార్లు డ్రీమ్ లైనర్ల విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Next Story

