Tue Mar 10 2026 14:04:17 GMT+0530 (India Standard Time)
ESMA : ఎస్మాను ప్రయోగించిన మోదీ సర్కార్
భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల చట్టాన్ని ప్రయోగించింది

భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల చట్టాన్ని ప్రయోగించింది. పశ్చిమాసియాలో యుద్ధం పరిస్థితుల కారణంగా దేశంలో తలెత్తే పలు రకాల సమస్యలను అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం చమురు శుద్ధి సంస్థలపై ఎస్మాను ప్రయోగించింది. పెట్రోలు, గ్యాస్ విషయంలో కృత్రి కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
కృత్రిమ కొరత సృష్టించకుండా...
పెట్రోల్, డీజిల్ గ్యాస్ ను కృత్రిమ కొరత సృష్టించి కొందరు లబ్దిపొందాలని చూస్తే వారిపై ఎస్మా చట్టం కింద కేసులు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, గ్యాస్ నిరంతరం సరఫరా జరిగేలా, పంపిణీలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింద.ి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది.
Next Story

