Mon Mar 02 2026 13:05:32 GMT+0530 (India Standard Time)
Breaking : ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం
ఇరాన్ పై ఇజ్రాయిల్ - అమెరికా దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది

ఇరాన్ పై ఇజ్రాయిల్ - అమెరికా దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమయింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రొ ఇరాన్ మత పరమైన ప్రసంగాలు చేసే వారిని గుర్తించాలని ఆదేశాల్లో కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. ఇంటలిజెన్స్ శాఖ కూడా అలెర్ట్ చేసింది.
సోషల్ మీడియాలో విద్వేష ప్రచారాలపై...
సోషల్ మీడియాలో విద్వేష ప్రచారాలపై నిఘా పెట్టాలని సూచించింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కేంద్ర హోం శాఖ ఈ లేఖను రాసింది. మత ప్రచారాలను చేసే వారిని గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉద్రిక్తతలు పెంచే ప్రసంగాలపై నిఘా పెట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Next Story

