Mon Jan 19 2026 21:35:45 GMT+0000 (Coordinated Universal Time)
ఆపరేషన్ సింధూర్ పై రాజ్ నాధ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని నిలిపివేయలేదని భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు

ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉందని నిలిపివేయలేదని భారత్ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అన్నారు. రాజ్ నాథ్ సింగ్ సోమవారం పహాల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రస్తావించారు. పాకిస్థానీ ఉగ్రవాదులు దాడిలో మతం ఆధారంగా అమాయకులను హతమార్చగాభారత్ మాత్రం ఉగ్రవాదుల మతాన్ని కాదు, వారి చర్యలను చూసి లక్ష్యంగా చేసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్లో ఏ పౌరులు గానీ, సైనిక స్థావరాలు గానీ దెబ్బతినలేదని వివరించారు. పాక్ చర్యలపై ఆధారపడి ఆపరేషన్ సింధూర్ 2 ఆధారపడి ఉంటుందని తెలిపారు.
మోరాకో పర్యటనలో...
మొరాకో పర్యటనలో రాజ్నాథ్ స్థానిక భారతీయులతో రబాత్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం ప్రత్యేకతను గమనించాలని, ఉగ్రవాదులు మన పౌరులను మతం అడిగి చంపారని, కానీ తాము ఎవరి మతం చూడలేదని వారు చేసిన పనులను బట్టి చర్యలు తీసుకున్నామనతి తెలిపారు. ఏ మతం, ఏ వర్గం చెందిన వారినీ మేము వివక్ష చేయమని, అదే భారత స్వభావమని రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేసన్ సింధూర్ కు తాత్కాలిక విరామమే తప్ప పూర్తిగా ఆపలేదని ఆయన స్పష్టం చేశారు.
Next Story

