Thu Jan 16 2025 01:52:58 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : టీం ఇండియాతో ప్రధాని ముచ్చట్లు
భారత్ క్రికెట్ టీం ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. ఆయనతో కలసి బ్రేక్ఫాస్ట్ చేశారు.
భారత్ క్రికెట్ టీం ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. ఆయనతో కలసి బ్రేక్ఫాస్ట్ చేశారు. వెస్టిండీస్ లో టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న టీం ఇండియా ఈరోజు ఉదయం భారత్ కు చేరుకుంది. ప్రధాని నివాసానికి వెళ్లింది. తన నివాసానికి వచ్చిన టీం ఇండియా క్రికెటర్లను మోదీ అందరితో విడివిడిగా పలకరించారు. వారితో కాసేపు ముచ్చటించారు.
ప్రతి ఒక్కరినీ...
ఫైనల్స్ లో వారి మనసులో చెలరేగిన అభిప్రాయాలనుకూడా మోదీ ఇంట్రస్టింగ్ గా అడిగి తెలుసుకున్నారు.పదిహేడేళ్ల తర్వాత ఇండియాకు కప్ సాధించిన టీం ఇండియా సభ్యులను ప్రధాని ప్రశంసించారు. వారితో కలసి గ్రూపు ఫొటో దిగారు. అనంతరం ప్రధాని నివాసం నుంచి బయలుదేరి ముంబయికిచేరుకుంటారు. సాయంత్రం ముంబయిలో భారత్ జట్టు రోడ్ షో నిర్వహించనుంది.
Next Story