Fri Mar 27 2026 23:03:18 GMT+0530 (India Standard Time)
నేడు భారత్ కు శుభాంశు శుక్లా
అంతరిక్ష యానం ముగించుకుని వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు భారత్ కు రానున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు

అంతరిక్ష యానం ముగించుకుని వచ్చిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు భారత్ కు రానున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ను సందర్శించిన తొలి భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా నేడు ఇండియాకు వస్తుండటంతో పెద్దయెత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. యాక్సియం - 4 మిషన్ శిక్షణలో భాగంగా శుభాంశు శుక్లా గత ఏడాది అమెరికా వెళ్లారరు. అక్కడి నుంచి మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చి అక్కడే ఉన్న శుభాంశు శుక్లా నేడు భారత్ కు చేరుకోనున్నారు.
మోదీతో భేటీ...
పద్దెనిమిది రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ పరిశోధనలు జరిపి వచ్చిన శుభాంశు శుక్లా ఆయన అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఎక్స్ లో పోస్టు చేశారు అమెరికా నుంచి ఆయన విమానంలో బయలుదేరారు. అయితే నేడు ప్రధాని నరేంద్ర మోదీతో శుభాంశు శుక్లా భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఆయనతో తన అంతరిక్ష అనుభవాలను పంచుకోనున్నారు.
News Summary - indian astronaut subhanshu shukla, who returned from space flight, will return to india today. he will meet prime minister modi
Next Story

