Fri Dec 19 2025 02:24:08 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి.. ఐదుగురు జవాన్లు గల్లంతు
లడఖ్లో ఇండియన్ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది.

లడఖ్లో ఇండియన్ ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశృతి చోటు చేసుకుంది. యుద్ధ విన్యాసాలు చేస్తుండగా నీటిలో ఐదుగురు జవాన్లు కొట్టుకుపోయారు. యుద్ధ ట్యాంక్ నదిని క్రాస్ చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఐదుగురు జవాన్లు కొట్టుకుపోయారు. వీరి కోసం సహాయక బృందాలు గాలిస్తు్నాయి. దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలోఈ ఘటన చోటు చేసుకుంది.
వారి కోసం గాలింపు చర్యలు...
చైనా సరిహద్దుల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ సమీపంలో గల న్యోమా-చుషుల్ ప్రాంతంలో భారత సైన్యం విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు గల్లంతయ్యారు.ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Next Story

