Fri Mar 06 2026 11:40:09 GMT+0530 (India Standard Time)
కూలిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానం
భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిపోయింది

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ యుద్ధ విమానం గల్లంతయిందని భావిస్తున్న సమయంలో అది కూలిపోయినట్లు గుర్తించారు. అస్సాంలోని అగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. గురువారం సాయంత్రం జోర్నాట్ నుంచి బయలుదేరిన విమానం ఆచూకీ లభించలేదు.
ఇద్దరు పైలెట్లు మృతి...
విమానం బయలుదేరిన కొద్ది సమయానికే గల్లంతు కావడంతో అప్పుడే అనుమానం వచ్చింది. రాడార్ తో సంబంధాలు సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానానికి తెగిపోయాయి. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా అస్సాంలో కూలిపోయినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.
Next Story

