Sat Mar 07 2026 23:55:55 GMT+0530 (India Standard Time)
ఇండియా కరోనా అప్డేట్.. భారీగా పెరిగిన కేసులు, మరణాలు
గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 40 మంది మరణించగా..

న్యూ ఢిల్లీ : భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మొన్న 1247 కేసులు నమోదవ్వగా.. నిన్న 2,067 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 40 మంది మరణించగా.. 1547 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్నటి కన్నా 65 శాతం పెరుగుదల ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో 12,430 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ దేశంలో 4,30, 47, 592 కోవిడ్ కేసులు నమోదు కాగా.. 5,22,006 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. కోవిడ్ నుంచికోలుకున్నవారి సంఖ్య 4,25,13,248కి చేరింది.
Next Story

