Fri Dec 05 2025 09:06:09 GMT+0000 (Coordinated Universal Time)
India Alliance: నేడు ఇంయా కూటమి సమావేశం
ఇండియా కూటమి నేడు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కూటమిలోని అన్ని పార్టీల నేతలు హాజరు కానున్నారు

ఇండియా కూటమి నేడు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కూటమిలోని అన్ని పార్టీల నేతలు హాజరు కానున్నారు. వర్చువల్ గా ఈ సమావేశం జరగనుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలిసింది. ఈరోజు నేషనల్ కన్వీనర్ ను ప్రకటించే అవకాశం ఉందని ఇండియా కూటమి పార్టీ నేతలు చెబుతున్నారు.
అనుసరించాల్సిన వ్యూహం....
లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో పొత్తులతో పాటు విజయమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, మ్యానిఫేస్టో రూపకల్పన ఉమ్మడిగా రూపొందించుకోవడం వంటి అంశాలపై చర్చించనున్నారని తెలిసింది. దీతో పాటు రేపటి నుంచి మణిపూర్ లో భారత్ న్యాయ యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభిస్తున్న నేపథ్యంలో దానిపై కూడా చర్చ జరగనుంది.
Next Story

