Mon Mar 16 2026 03:13:20 GMT+0530 (India Standard Time)
India Alliance : నేడు ఇండియా కూటమి భేటీ
నేడు ఇండియా కూటమి సమావేశం కానుంది. నాలుగోసారి ఇండియా కూటమి భేటీ జరగనుంది

నేడు ఇండియా కూటమి సమావేశం కానుంది. నాలుగోసారి ఇండియా కూటమి భేటీ జరగనుంది. ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి ప్రతిపక్ష నేతలంతా హాజరుకానున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికలు తర్వాత జరుగుతున్న భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కీలక అంశాలపై కూటమి సభ్యులు చర్చించనున్నారు.
లోక్సభ ఎన్నికలు...
లోక్సభ ఎన్నికలకు మరో 90 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇండియా కూటమిలో చర్చించనున్నారు. బీజేపీ స్పీడ్ కు ఎలా కళ్లెం వేయాలి? ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీంతో లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా నేడు భేటీలో చర్చ జరగనుంది.
Next Story

