Sun Mar 08 2026 13:03:30 GMT+0530 (India Standard Time)
ఎర్రకోటపై జెండాను ఆవిష్కరించిన ప్రధాని
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశమంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశమంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ వరసగా పదకొండోసారి ప్రధాని హోదాలో జాతీయ జెండాను ఎగుర వేశారు. ఎర్రకోట జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్యఅతిధులతో పాటు ఉన్నతాధికారులు, మంత్రులు హాజరయ్యారు. మొత్తం ఆరువేల మంది హాజరయ్యారు.
ప్రపంచానికే...
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని తెలిపారు. హర్‌ఘర్ తిరంగా పేరుతో దేశ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయని, దేశంతో కోసం జీవితాలనే పణంగా పెట్టిన ఎందరో మహనీయులున్నారని ప్రధాని మోదీ అన్నారు.
Next Story

